Breaking News

G20 summit: ఏకాభిప్రాయం సాధిస్తాం

Published on Sat, 09/09/2023 - 06:04

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్‌ దాదాపు సిద్ధమైందని భారత్‌ ప్రకటించింది. ‘ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ దిశగా సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నాయి’ అని భారత్‌ ప్రకటించింది. సదస్సుకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా వెల్లడించారు. అయితే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో సమ్మతి సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఆయన చెప్పలేదు.

‘ ఆఫ్రికా యూనియన్‌కు జీ20 కూటమిలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనే అంశంపై శనివారం జరిగే సదస్సులో నిర్ణయం తీసుకోవచ్చు’ అని క్వాత్రా తెలిపారు. ‘ప్రధాని మోదీకి గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై ప్రగాఢ విశ్వాసముంది. అందుకే ఆఫ్రికా యూనియన్‌ను కలుపుకుందామని జీ20 సభ్యదేశాలకు రాతపూర్వకంగా మోదీ విన్నవించుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌ అనేది గ్లోబల్‌ సౌత్‌కు, అభివృద్ధి దేశాలకు గొంతుకగా ఉంటుంది.

జీ20కి భారత సారథ్యం సమ్మిళితంగా, లక్ష్య సాధకంగా, క్రియాశీలకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు ’ అని జీ20 షెర్పా అయిన అమితాబ్‌ కాంత్‌ చెప్పారు. ‘ భారత వైవిధ్య, సమాఖ్య నిర్మాణానికి గుర్తుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 నగరాలు, పట్టణాల్లో 220కిపైగా జీ20 సంబంధ సమావేశాలు జరిగాయని అమితాబ్‌కాంత్‌ పేర్కొన్నారు. అగ్ర నేతలు పాల్గొనే సెషన్స్‌లు మూడు విడిగా జరుగుతాయి. వీటికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని నామకరణం చేశారు.

శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అగ్రనేతల గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. జీ20 నేతలంతా రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీకి ఘన నివాళులు అర్పించనున్నారు. ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, సమ్మిళిత వృద్ధి, ఉక్రెయిన్‌ యుద్ధం, వాతావరణంలో పెను మార్పులు, గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర కీలక అంశాలు నేతల మధ్య భేటీలో చర్చకు రానున్నాయి. మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, జర్మనీ చాన్స్‌లర్‌ స్కోల్జ్, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ సహా ఇతర దేశాల నేతలు, ఈయూ, ఐఎంఎఫ్, వరల్డ్‌ బ్యాంక్, ఓఈసీడీ, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు హాజరుకానున్నారు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)