Breaking News

ఢిల్లీ డిక్లరేషన్ వెనక కఠోర శ్రమ వీరిదే..

Published on Sun, 09/10/2023 - 11:41

ఢిల్లీ: ఢిల్లీ డిక్లరేషన్‌పై ప్రపంచ దేశాలు ఏకాభిప్రాయం సాధించడం వెనుక జీ20 షేర్పాల నిరంతరం కష్టం దాగి ఉంది. ఉక్రెయిన్ అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్ట్‌లు అవసరమయ్యాయి. నిరంతరాయంగా పనిచేసిన తన బృంద సభ్యులను జీ20 షేర్పా అమితాబ్ కాంత్ ప్రశంసించారు. 

'ఢిల్లీ డిక్లరేషన్‌లో క్లిష్టమైన అంశం ఉక్రెయిన-రష్యా యుద్ధం. ఈ భౌగోళిక అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు 300 ద‍్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్టులు అవసరమయ్యాయి. ఈ పనంతా ఇద్దరు అధికారులు చేశారు' అని అమితాబ్‌ కాంత్ తన బృంద సభ్యులను మెచ్చుకున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరంగా దేశాధినేతల మధ్య భిన్నాభిప్రాయాలు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అంశాలు వివాదాస్పదంగా ఉన్న సమయంలో జీ20ని నిర్వహించి, తీర్మాణాలపై ఏకాభిప్రాయం కుదర్చడం గొప్ప విజయంగా భావించవచ్చు. ఢిల్లీ డిక్లరేషన్‌ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందగానే ప్రధాని మోదీ ప్రశంసనీయంగా ప్రకటించారు. షేర్పాలు, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 

'భారత్ జీ20కి అధ్యక్షత వహించేప్పుడే డిక్లరేషన్‌ అందరినీ కలుపుకుని, నిర్ణయాత్మకంగా, ఆచరణాత్మక దిశలో ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. డిక్లరేషన్‌లో మొత్తం 83 పేరాలు ఉన్నాయి. అందులో ఎనిమిది పేరాలు భౌగోళిక అంశాలు ఉన్నాయి.  అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం విశేషం' అని అమితాబ్‌ కాంత్‌ అన్నారు. 

ఢిల్లీ డిక్లరేషన్‌ ఏకాభిప్రాయం కుదరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కోసం నిరంతరం పనిచేసిన షేర్పాలను ఆయన ప్రశంసించారు. 

ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)