Breaking News

రొటీన్‌ లైఫ్‌ బోర్‌ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్‌ రైడ్స్‌తో రోజుకు రూ. 1500

Published on Fri, 06/05/2026 - 12:47

రొటీన్ లైఫ్  ఎవరికైనా బోర్‌ కొడుతుంది. కార్పొరేట్ ఉద్యోగంలో ఉండే వారికి ఇంకా ఫస్ట్రేషన్‌ వస్తుంది. కానీ   బాధ్యతలు, స్థిరమైన జీతం, మిగిలిన సౌకర్యాల కారణంగా ఉద్యోగం చేయక తప్పదు. కానీ 9-5 జాబ్‌ విసుగు నుంచి బయట పడేందుకు ఒక యువకుడు ఎంచుకున్న వినూత్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోజూ ఆఫీసులో గంటల తరబడి పని, అలసి ఇంటికొచ్చాక ఏదో వెలితిగా అనిపించడం, ఇలా ప్రతిరోజూ ఒకేలా సాగుతుండటంతో విసుగు చెంది, సాయంత్రం వేళల్లో ఇంట్లోనే కూర్చోకుండా, రాపిడో రైడర్‌గా రిజిస్టర్ చేసుకుని పని ప్రారంభించాడు. ఇది అతనికి ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ ఎంతో మేలు చేసింది.రోజుకు అదనంగా రూ. 600,రూ. 700 వరకు సంపాదిస్తాడు. అదే ఫుల్‌ టైం రైడింగ్  చేస్తే, రోజు రూ. 1,500 వరకు సంపాదిస్తానంటూ దీపక్ పాండే తన గురించి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పు కొచ్చాడు.


రొటీన్ లైఫ్‌కు బ్రేక్
స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ, మానసికంగా ఎంతో అలసిపోయినట్లు అనిపించడంతో దీపక్ ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆఫీస్ పనిలోని ఏకధాటి రొటీన్ నుండి తప్పించుకోవడానికి సరదాగా ప్రారంభించిన ఈ ప్రయోగమే రెండో ఆదాయ వనరుగా మారిందని తెలిపాడు. కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు విభిన్న వ్యక్తులతో మాట్లాడటం, నగరాన్ని చుట్టేయడం, కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం కారణంగా సరికొత్త జీవనశైలిఅలవడి కొత్త స్ఫూర్తినిస్తోందని దీపక్ తెలిపాడు.

ఇంకో విషయం ఏమిటంటే
చాలా కాలం పాటు ఓటమి భయం, సమాజం ఏమనుకుంటుందో అనే ఆందోళన తనను కొత్త విషయాలు ప్రయత్నించకుండా అడ్డుకున్నాయని దీపక్   తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అలసట అనేది మనం చెప్పుకునే ఒక సాకు మాత్రమే. జీవితంలో  అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే మన కంఫర్డ్‌జోన్‌ నుంచి బయటికొచ్చి కష్టపడాలి అంటూ తన ఫాలోవర్లకు సందేశమిచ్చాడు. . కార్పొరేట్ ఉద్యోగం, ర్యాపిడో  ద్వారా అదనపు ఆదాయంతో పాటు, PhD చేస్తున్నాడు. స్వయంగా వంట చేసుకుంటాడు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేస్తూ, వీడియోలను ఎడిట్ చేసుకుంటాడు. దీంతో దీపక్‌ లైఫ్‌స్టైల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

ఇదీ చదవండి: అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)