Breaking News

తీవ్ర చిక్కుల్లో అనిల్‌ అంబానీ.. బ్యాంక్‌లకు ఈడీ నోటీసులు

Published on Mon, 08/04/2025 - 13:37

రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీని కష్టాలు వెంటాడుతున్నాయి. మనీలాండరింగ్‌ కేసులో ఆయనపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. తాజాగా ఈ కేసులో పలు బ్యాంకులకు నోటీసులు  జారీ చేసింది. లోన్ ఫ్రాడ్ కేసుకు సంబధించి పలు వివరాలు కోరింది. వీటిల్లో ఆయన కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలు వంటివి ఉన్నాయి. 

మొత్తం 12-13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటిలో వీటిల్లో పబ్లిక్‌ సెక్టార్‌తోపాటు ప్రైవేటు సెక్టార్‌ బ్యాంకులు ఉన్నాయి. ఇవి రిలయన్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలకు భారీగా అప్పులు ఇచ్చాయి. తాజాగా ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సింద్‌ బ్యాంక్‌ ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 

అనిల్‌ అంబానీ  కంపెనీలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు బ్యాంక్‌ అధికారులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. వీరిని లోన్‌ క్లియరెన్స్‌లకు సంబంధించి అనుసరించిన ప్రాసెస్‌, రికవరీ చర్యలను అడగనున్నట్లు తెలుస్తోంది. 

కాగా అనిల్‌ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇటీవల అనిల్‌ అంబానీుకి నోటీసులు ఇవ్వగా తాజాగా మరో ఆరుగురికి కూడా నోటీసులు కూడా ఇచ్చింది. గత వారం రూ.3,000 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న పార్థసారధి బిస్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)