Breaking News

జమ్ములో కొనసాగుతున్న ఉగ్ర వేట.. నలుగురు పోలీసుల వీరమరణం

Published on Fri, 03/28/2025 - 06:54

శ్రీనగర్‌:  జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.

రాజ్‌బాగ్‌ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పాక్‌ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్‌ ఆపరేషన్‌ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్‌ సెక్టార్‌లో జమ్మూకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్‌ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. 

అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్‌ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)