Breaking News

అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!

Published on Sat, 10/12/2024 - 05:23

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్‌ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్‌’లో ప్రస్తావించారు. ట్రంప్‌ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్‌ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్‌ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు.

 కేజ్రీవాల్‌ ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్‌ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్‌ ప్రకటించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)