Breaking News

దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి

Published on Tue, 03/18/2025 - 09:20

వడోదర: గుజారాత్‌లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర(Vadodara) జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై  మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఈ దాడిలో ఒక విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి వాఘోడియా పోలీస్ స్టేషన్‌(Police station)లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం థాయిలాండ్, సూడాన్, మొజాంబిక్, బ్రిటన్‌కు చెందిన నలుగురు విద్యార్థులు పరుల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మార్చి 14న సాయంత్రం ఈ విద్యార్థులను దాదాపు 10 మంది వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. ఆ విద్యార్థులు గుజరాతీ భాష అర్థం చేసుకోలేకపోవడంతో వారిపై దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారు ఒక దర్గాకు వెళ్లగా, వారిని బూట్లు ధరించి రాకూడదని ఒక వ్యక్తి సూచించారు. ఇది వారికి అ‍ర్థం కాలేదు.

దాడి సమయంలో ముగ్గురు విద్యార్థులు తప్పించుకోగలిగారని, థాయ్ విద్యార్థి సుపచ్ కంగ్వాన్రత్న (20)తలకు తీవ్ర గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. బాధితుడిని పరుల్ సేవాశ్రమ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వాఘోడియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)