Breaking News

మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ కన్నుమూత

Published on Tue, 01/06/2026 - 08:41

పూణే: ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి  సురేష్ కల్మాడీ (81)  నేడు (మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సురేష్ కల్మాడీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎరందవనేలోని ఆయన నివాసం ‘కల్మాడీ హౌస్’లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచనున్నారు. అభిమానులు, రాజకీయ నేతలు ఆయనకు నివాళులు అర్పించేందుకు భారీగా తరలిరానున్నారని సమాచారం. మధ్యాహ్నం 3:30 గంటలకు పూణే నవీ పేటలోని వైకుంఠ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

భారత రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతగా కల్మాడీ సుదీర్ఘ కాలం పనిచేశారు. 1995-96 మధ్య కాలంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లోకి ప్రవేశించకముందు ఆయన భారత వైమానిక దళంలో (ఐఎఎఫ్‌) పైలట్‌గా 1964 నుండి 1972 వరకు పనిచేశారు. క్రీడా రంగంలో భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షునిగా దేశీయ క్రీడా రంగంలో కీలక పాత్ర పోషించారు. భారత క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో  ఎనలేని కృషి చేశారు.

2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు కల్మాడీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఈ కేసులో 2011లో ఆయన అరెస్ట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం 2016లో ఆయనను ఐఓఏ జీవితకాల అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పదవిని తిరస్కరించారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)