Breaking News

మొదటి అంతరిక్ష యాత్రికుడు హనుమాన్‌!

Published on Tue, 08/26/2025 - 04:59

ఉనా (హిమాచల్‌): మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? యూరీ గగారిన్‌.. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లో పిల్లలు చెప్పిన సమాధానం.. అందుకు మన కేంద్ర మాజీ మంత్రి ఇచ్చిన వివరణ.. మన దేశ విద్యా వ్యవస్థ దుస్థితి ఏంటో తెలియజెప్తోంది. ఇటీవల బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఆయన విద్యార్థులను ‘అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు?’ప్రశ్నించారు. దానికి పిల్లలంతా ముక్త కంఠంతో ‘నీల్‌ ఆర్మ్‌్రస్టాంగ్‌’అని చెప్పారు.

 అందుకు ఎంపీ.. ‘కాదు.. నేను హనుమాన్‌ అనుకుంటున్నాను. వేల సంవత్సరాల నాటి మన సంప్రదాయం, జ్ఞానం, సంస్కృతి ముఖ్యమైనవని ఇది చూపిస్తుంది. మనం మన స్వంతం గురించి నేర్చుకోకపోతే, బ్రిటిష్‌ వారు మనకు నేర్పించిన దానికే మనం పరిమితం అవుతాం’అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది. ఆ రెండు సమాధానాలు తప్పు. ‘నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ కాదు.. యూరీ గగారిన్‌’అని చెప్పాల్సిన ఒక పార్లమెంటేరియన్‌.. జాతీయ అంతరిక్ష దినోత్సవం నాడు పిల్లల తప్పును సరిదిద్దకపోగా.. పురాణాలను చరిత్రగా చెప్పడం వివాదాస్పదమైంది. 

చర్రిత తప్పుదోవ..  
అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు సోవియట్‌ వ్యోమగామి యూరి గగారిన్‌. అతను 1961లో ఆయన భూమిని చుట్టి వచ్చారు. ఆ తరువాత 1969లో అమెరికాకు చెందిన నీల్‌ ఆర్మ్‌్రస్టాంగ్‌ చంద్రునిపై నడిచిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ (హెచ్‌) శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని చెబుతోంది. ఇప్పుడు ఆ చర్చ పక్కకు పోవడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ‘పిల్లల మనసులను వలస ఆలోచనల నుంచి విముక్తి చేసి.. స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు మేరకే ఠాకూర్‌ అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ.. సొంత సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడమంటే... సైన్స్, చరిత్ర పేరుతో పురాణాలను వల్లించడం కాదనే విషయాన్ని మరిచారు. మన చరిత్ర, సంస్కృతిని విద్యార్థులకు చెప్పాలనుకున్నప్పటికీ.. వాస్తవాలు, కల్పనల మధ్య తేడాను గుర్తించడం వారికి నేర్పించాలి. పురాణాలను పురాణాలుగానే చెప్తే తప్పు లేదు. కానీ.. పురాణాలను చరిత్రగా చెప్పడం కొత్త తరాన్ని తప్పుదోవ పట్టించడమే’అంటున్నారు.  

శాస్త్రీయ రుజువులు లేని పురాణాలు.. 
చరిత్ర వేరు.. పురాణాలు వేరు. రామాయణం, మహాభారతం వంటివి పురాణ కథలు. ఇవి నమ్మకం మీద నడిచేవి. కవి హోమర్‌ వర్ణనలను పోలిన నగరం 19వ శతాబ్దపు త్రవ్వకాల్లో బయటపడే వరకు ట్రాయ్‌ కూడా కల్పితంగానే పరిగణించారు. మన దేశంలో చాలా కథలకు భౌతిక ఆధారాలు లేవు. గుజరాత్‌ తీరంలో మునిగిపోయిన పురాతన నిర్మాణాలను పురావస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు మహాభారతంలోని ద్వారక నగరానికి లింక్‌ చేశారు. దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. శాస్త్రీయ రుజువు లేకుండా, ఈ కథలు శక్తివంతమైన సాంస్కృతిక కథనాలుగా మిగిలిపోతాయే తప్ప, చరిత్రగా కాదు. గట్టి రుజువుతో నిరూపించబడే వరకు, యూరి గగారిన్‌ అంతరిక్షంలో మొదటి వ్యక్తిగా స్థిరపడతాడు. పిల్లలకు ఈ తేడాను నేర్పించాలి మరియు పార్లమెంటు సభ్యులు విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి.  
 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు