Breaking News

బిష్ణుపూర్‌ లోక్‌సభ బరిలో విచిత్ర పోరు

Published on Mon, 03/11/2024 - 07:27

2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి బరిలోకి దిగే తమ 42 మంది అభ్యర్థుల పేర్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇక్కడి బిష్ణుపూర్ స్థానం చర్చనీయాంశంగా మారింది. విడాకులు తీసుకున్న ఒక జంట ఈ సీటు నుంచి పరస్పరం పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. 

బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ సౌమిత్రా ఖాన్‌కు బీజేపీ టిక్కెట్‌ కేటాయించింది. అదే స్థానం నుండి అతని మాజీ భార్య సుజాత మండల్‌కు టీఎంసీ టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సౌమిత్రా ఖాన్, సుజాత మండల్ విడిపోయారు. ఆ సమయంలో సుజాత మండల్ తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సౌమిత్ర ఖాన్ టీఎంసీ నుండి బీజెపీలో చేరారు. 

టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో కాంగ్రెస్‌తో పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు ముందు  ఏ సమయంలోనైనా కూటమి ఏర్పడవచ్చని అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టీఎంసీ టిక్కెట్లు ఇచ్చింది. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మెగా ర్యాలీలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, మోదీ హామీకి ఎలాంటి వారెంటీ లేదని వ్యాఖ్యానించారు.

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)