Breaking News

చుక్..చుక్‌..చుక్‌.. రైలు కాదండోయ్ ఇళ్లు..!

Published on Sat, 02/07/2026 - 16:46

జీవిత చరమాంకంలో చాలా మంది తాము అప్పటి వరకూ చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాటి గురించే ఇతరులకు చెప్పుతు లేదా తమలో తామే ఆలోచిస్తూ బాధ పడడమే లేక సంబరపడడమే చేస్తుంటారు. అయితే ఇక్కడ  రైల్వేశాఖ మాజీ ఉద్యోగి మాత్రం  విభిన్నంగా ఆలోచించారు. తను ఇంతకాలం పనిచేసిన జ్ఞాపకాలకు మనసులో కాకుండా కళ్లెదుట చూడాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆ నిర్మాణం చేపట్టారు.

తమ జ్ఞాపకాలను వదలకుండా ఉండడానికి.. చాలా పనులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక రైల్వే ఉద్యోగి ఇంతకాలం తను పని చేసిన సంస్థను వీడలేకపోయాడు. అవే జ్ఞాపకాలతో అను నిత్యం తనతో ఉండాలనుకున్నాడు ఇంకేంటి అనుకున్నదే తడువుగా తన ఇంటినే రైల్వే కోచ్‌గా మార్చాడు. దీని నిర్మాణం కోసం తన స్వహస్తాలతో  రైలు నమూనాను చెక్కాడు.

కేరళ, కాసరగోడ్ రవనీశ్వరం-చల్లింగల్ రహదారిపై వెళుతుంటే ఎవరి కన్నైనా సరే ఒకసారి ఆ ఇంటిపై పడాల్సిందే. ఎంటబ్బా ఈ నిర్మాణం అని అనాల్సిందే? ఎందుకంటే అది సాధారణ ఇళ్లు కాదుగా మరి.. పురాతన రైల్వే కోచ్‌ మోడల్‌కు చెందిన నమూనా.. అందుకే దాని నిర్మాణం చూసి ఎవరైనా ఔరా అనాల్సిందే..

టీ. దామోదరన్ అనే వ్యక్తి రైల్వేలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. 20 ఏళ్ల క్రితమే ఆయన తన వృత్తికి స్వచ్ఛంగ విరమణ ప్రకటించారు. అయితే అంతకాలం రైల్వేలో పనిచేయడం ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేయడంతో ఆయన మదిలో ఎప్పుడూ రైలు జ్ఞాపకాలే మెదిలాడేయి. దీంతో ఆయన తన ఇంటినే రైలుగా మార్చాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అనుకున్నదే తడవుగా ఆ నిర్మాణం చేపట్టారు.

రెండేళ్ల క్రితం ఇండియన్ రైల్వే బ్యాన్ చేసిన ALCO లోకోమోటివ్ మోడల్‌లో దాని నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణంలో సహాజాకృతి రావాలని స్వయంగా ఆయనే 'రేక్‌వాల్' స్ప్రింగ్స్, వీల్స్ తదితరవన్ని కర్రతో తానే చెక్కినట్లు తెలిపారు. తాపీవారికి ఆ పని అప్పగిస్తే అంత సులభంగా చేయలేరని తానే ఆ పని చేసినట్లు దామోదరన్ అన్నారు.

ఇక్కడితో కథ ముగియలేదు. తను ఎంతో కష్టపడి నిర్మించిన తన జ్ఞాపకాల గుర్తుకు తనను పెంచి పెద్దచేసిన తన మాతృమూర్తి పేరు మీద "ఆచా కోచ్"  అని పెట్టాడు.  తన మాతృమూర్తి తనను ఎంతో గొప్పవాడు కావాలని కలలు కందని దానికోసం ఎంతో తపించిందని అందుకోసమే తన పేరు పెట్టినట్లు తెలిపారు.

తన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తనకు ఏ జాబు రాలేదని అందుకే సేల్స్‌మాన్‌గా చేరానని ఆ సమయంలోనే తనకు రైల్వేస్‌ నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చిందని దామోదరన్ తెలిపారు. అయితే తాను వెళ్లడానికి నిరాకరించడంతో తన యజమాని వెళ్లాల్సిందని పట్టుబట్టినట్లు తెలిపారు. 1977లో రైల్వేలో ఉద్యోగంలో చేరగా 1996లో పదవీ విరమణ పొందినట్లు తెలిపారు. ఫిబ్రవరి 21న రైలు ఇళ్లును ప్రారంభించే ఫంక్షన్ ఘనంగా చేయనున్నట్లు దామోదరన్ తెలిపారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య