Breaking News

రాజకీయాల్లోకి మాజీ డీజీపీ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

Published on Sat, 07/27/2024 - 07:28

రిటైర్డ్ పోలీసు అధికారులు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణంగా మారింది. పోలీసు ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకుని, యూపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అసీమ్ అరుణ్ బీజేపీకి చెందిన ప్రముఖ నేతల జాబితాలో చోటు దక్కించుకున్నారు.  ఇదేవిధంగా పలు రాష్ట్రాల పోలీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే ముంబైలోని వెర్సోవా నియోజకవర్గం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ నేపధ్యంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ డీజీపీ పాండే మీడియాకు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తాను ఉంటున్న నియోజకవర్గం నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, అన్ని వర్గాల మద్దతును స్వాగతిస్తున్నానని పాండే పేర్కొన్నారు.

ముంబై పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేసిన  పాండే తాను ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని, సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, దానిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పాండేను 2022 సెప్టెంబర్‌లో సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నేపధ్యంలోనే సంజయ్ పాండే వార్తల్లో నిలిచారు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో చదువుకున్నారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)