Breaking News

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ బెయిల్‌ పొడిగింపు

Published on Tue, 09/12/2023 - 18:11

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ మెడికల్‌ బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. జైన్‌ మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబర్‌ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు ఏఎస్‌ బోపన్న, బేల ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు నేడు విచారించింది. ఈడీ తరుపున అడిషనల్‌ సొలిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ జైన్‌ కేసును వాయిదా వేయాలని, బెయిల్‌ పొడిగించాలని కోరారు. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను పొడిగిస్తూ విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది.

జైన్‌కు వెన్నుముక సర్జరీ తర్వాత ఆయన మెడికల్‌ బెయిల్‌ను పొడిగించడం ఇది మూడోసారి. తొలిసారి మే 26న సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల ఆగస్టులో రెండోసారి పొడిగించింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు, అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లరాదని పలు ఆంక్షలు విధించింది.

కాగా ఆమ్‌ ఆద్మీ నేత, మాజీ మాంత్రి మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. 2015 ఫిబ్రవరి 14నుంచి వివిధ వ్యక్తుల పేరిట అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై నమోదైన సీబీఐ ఫిర్యాదుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును విచారిస్తోంది.   
చదవండి: ఎట్టకేలకు భారత్‌ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)