Breaking News

బాలికపై అమానుషం.. కాలితో తన్ని.. మినిష్టర్ భార్య నిర్వాకం 

Published on Sat, 06/24/2023 - 13:57

అస్సాం : అసోం గణ పరిషద్ కు చెందిన మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి(85) భార్య ఫర్హానా(28) ఒక మైనర్ బాలికను కాలితో తన్నుతూ కొడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. వెంటనే బాలల హక్కుల సంరక్షణ సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు రంగంలోకి దిగి మాజీ మంత్రిని అతడి భార్యను అరెస్టు చేశారు. 

బాలల సహాయక సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి చౌదరి ఫర్హానా దంపతులు ఈ 12 ఏళ్ల బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నామని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలేవైనా ఉన్నాయా అంటే లేవంటున్నారు. వీడియోలో ఆ బాలికను ఎందుకలా చావగొడుతున్నావని అడిగితే స్కూల్ చదువుల్లో బాగా వెనకబడిపోయినందునే కోపంతో కొట్టానని చెబుతోంది మాజీ మంత్రి భార్య. అంతేకాదు ఈ వీడియో స్వయంగా నేనే తీశానని నా భర్తకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని చెబుతోంది. ఏది ఏమైనా ఆ బాలిక పట్ల ఆమె ప్రవర్తన అమానుషమన్నారు చంద్రధర్. 

కేసు నమోదు చేసిన హోజాయ్ పోలీసులు బాలిక తల్లితో పాటు మిగతావారిని కూడా సంప్రదించి ఇందులో వీరిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. హాజీ రౌఫ్ చౌదరి పైనా అతని భార్య ఫర్హానా పైనా ఐపీసీ 324,25 సెక్షన్లతో పాటు బాల కార్మికుల(నిషేధం & నియంత్రణ) చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.        

ఇది కూడా చదవండి: మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?

Videos

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

Photos

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)