Breaking News

ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ సతీమణి ఓటు గల్లంతు

Published on Mon, 05/13/2024 - 10:51

పుణె: ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ప్రదీప్ వసంత్ నాయక్ సతీమణి ఓటు గల్లంతయింది. ఓటర్ల జాబితా నుంచి తన భార్య మధుబాల పేరు తొలగించడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ రోడ్‌లోని పోలింగ్ బూత్ నంబరు26లో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఏసీఎం నాయక్, తన భార్య, కుమారుడు వినీత్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే తన భార్య పేరు ఓటరు జాబితాలో కనిపించలేదు. విషయాన్ని అక్కడి అధికారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని ఏసీఎం నాయక్ పీటీఐకి చెప్పారు.

“మేము పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన ఓటరు స్లిప్పులు మా వద్ద ఉన్నాయి. కానీ నా భార్య పేరు జాబితాలో లేదు”అని ఎయిర్స్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్ వాపోయారు. పుణె సిట్టింగ్ ఎంపీ గిరీష్ బాపట్ మరణం తర్వాత బీజేపీ మాజీ మేయర్ మురళీధర్ మోహోల్‌ను పుణె లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. గత ఏడాది జరిగిన కస్బా అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించిన రవీంద్ర ధంగేకర్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)