Breaking News

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు.. హెచ్చరికలు జారీ

Published on Thu, 12/19/2024 - 10:13

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. తాజా పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. విజిబులిటి 500 మీటర్లకు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌లా మారిపోయింది.

ఢిల్లీలో కాలుష్యం, పొగ మంచు కారణంగా విజిబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. దీంతో, వాయు కాలుష్యం సీవియర్‌ ప్లస్‌ కేటగిరిలో కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్‌లో గ్రాఫ్‌-4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌లా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్దులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.

 

మరోవైపు.. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం అక్షర్‌ధామ్‌ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకుంది. దీంతో, దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో, ప్రజలు వణికిపోతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)