Breaking News

Five States Assembly Elections 2023: 12 రాష్ట్రాల్లో అధికార పీఠంపై కమలం

Published on Mon, 12/04/2023 - 05:37

న్యూఢిల్లీ:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రశంసనీయమైన ఫలితాలు సాధించింది. మూడు కీలక రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సులువుగా నెగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టినట్లయ్యింది. ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలున్నాయి.

ఇక మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరడం లాంఛనమే. అలాగే మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాడ్, సిక్కిం ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోంది. దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కోల్పోయింది. తెలంగాణలో విజయం సాధించింది. కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఇప్పటికే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది.

ఇప్పుడు తెలంగాణ సైతం ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. అంటే మొత్తం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలోకి ఉన్నట్లు లెక్క. బిహార్, జార్ఖండ్‌ ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. మరో జాతీయ పార్టీ అయిన ఆమ్‌ ఆద్మీ పారీ్ట(ఆప్‌) ఢిల్లీ, పంజాబ్‌లో పూర్తి మెజారీ్టతో అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోవడంతో ఇక ఉత్తర భారతదేశంలో ‘ఆప్‌’ అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించిందని ఆ పార్టీ నేత జాస్మిన్‌ షా తెలిపారు. 2024లో లోక్‌సభ సాధారణ ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)