Breaking News

odisha: ఘోరం.. పది రోజుల్లో ఐదు అత్యాచారాలు

Published on Thu, 06/26/2025 - 15:13

భువనేశ్వర్: భారతదేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవం, ఆధ్యాత్మిక శోభతో అలరారే రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి  కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయం, చిలికా సరస్సు వంటి అనేక ప్రాచీనమైన, ప్రకృతి శోభతో ఒడిశా ఫరిడవిల్లుతోంది. కానీ ఇటీవల అక్కడ చోటుచేసుకున్న వరుస అత్యాచార ఘటనలు ఆ రాష్ట్ర ప్రాభవాన్ని దెబ్బతీస్తున్నాయి. గడిచిన గత పది రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు అత్యాచార ఘటనలు  రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.

తాజాగా, మయూర్భంజ్ జిల్లా కరంజే ప్రాంతంలో దారుణం జరిగింది. జూన్‌ 25న ఓ యువతి స్థానికంగా ఉన్న దేవాలయంలో దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో మాటు వేసిన  ముగ్గురు అగంతకులు యువతిపై దాడి చేశారు. అనంతరం, స్థానిక అడవుల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన మలర్పాడ గ్రామానికి చెందిన బికాష్ పాత్రాను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

1. గంజం జిల్లా,గోపాల్‌పూర్‌ బీచ్‌,జూన్‌17 : ఓ యువతి తన స్నేహితుడితో కలిసి  గోపాల్‌పూర్‌ బీచ్‌ చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో నిందితులు బాధితురాల్ని స్నేహితుడిపై దాడి చేశారు. అనంతరం, నిందితులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం 10మంది నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.

2.టెన్తలపాషి గ్రామం, కియోంఝర్ జిల్లా, జూన్ 18: ఉదయం తన ఇంటి సమీపంలో 17 ఏళ్ల బాలికను నిందితులు ఉరితీశారు.దుర్ఘటన జరిగిన ముందు రోజు సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహంపై గాయాలైన గుర్తులు ఉండడంతో బాలికపై దారుణం జరిగినట్లు తేలింది. ఆమె మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

3.బరిపడ, మయూర్భంజ్ జిల్లా, జూన్ 19: 31 ఏళ్ల మహిళ భర్త జూన్ 19న బరిపడ సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో నలుగురు నిందితులు ఇంట్లోకి చొరబడి  తన భార్యపై అత్యాచారం చేశారని ఆరోపించారు.

4. బెర్హంపూర్, గంజాం జిల్లా, జూన్ 25: జూన్ 25న క్లినిక్ యజమాని తనపై అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. బాధితురాలు బీఎస్సీ (నర్సింగ్) చదవడానికి సహాయం చేస్తానని, ఉచిత వసతి కల్పిస్తానని నిందితుడు కుటుంబానికి హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు మరియు దర్యాప్తు జరుగుతోంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)