Breaking News

తడిచి ముద్దైన ఢిల్లీ : చిల్‌ అయిన సింగపూర్‌ హైకమిషనర్‌

Published on Fri, 01/23/2026 - 17:10

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరం ఢిల్లీలో శుక్రవారం ఉన్నట్టుండి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో కాలుష్య భూతంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ వాసులకు  చాలా ఉపశమనం లభించింది.  గాలి నాణ్యత  మెరుగుపడుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది.   అయితే ఈ వాతావరణాన్ని భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ఎంజాయ్‌ చేయడం విశేషంగా నిలిచింది.

ఢిల్లీ వాతావరణం చల్లగా ఉండటంతో  సైమన్ వాంగ్  ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. వేడి వేడి చాయ్‌ కప్పును పకోడీలు, వర్షంతో తడిచిన పచ్చగా మెరుస్తున్న పచ్చిక బయలులో  వర్షాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు  కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశారు.  చాయ్‌, పకోడితో ఈ ఏడాదిలో (2026) చాయ్ పకోడీతో  ఇదే ఫస్ట్‌ బారిష్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా..  నాతో చేరండి?”  అనే  క్యాప్షన్‌తో ఈ ఫోటోలను షేర్‌చేశారు.

దీంతో నెటిజన్లు కూడా వర్షంలో తడిచిపోయినంత సంతోష పడ్డారు.  చాలా బాగుంది... నేను కూడా వస్తున్నా అని ఒకరు, ఉల్లి పకోడి అయితే సూపర్‌గా ఉంటుంది సార్‌. అని ఒకరు కమెంట్‌ చేయగా,  “సర్, నేను తయారుచేసిన టీని మీరు తప్పక తాగండి అని  మరొకరు కామెంట్‌ చేయడం విశేషం.

దిగి వస్తున్న కాలుష్యం
ఢిల్లీ-NCR శుక్రవారం ఉదయం చల్లని శీతాకాల పరిస్థితుల మధ్య 2026లో తొలిసారి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. IMD ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గేఅవకాశం ఉంది. జనవరి 23న, కనిష్ట ఉష్ణోగ్రత 12°C వద్ద నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది 19°C. వర్షం తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది, రోజుల తరబడి ప్రమాదకర కాలుష్యం తర్వాత AQI 'సంతృప్తికరమైన' 201-300  స్థాయికి చేరింది.

 

సైమన్ వాంగ్
2020న జూన్‌ 30న భారత రిపబ్లిక్‌కు హై కమిషనర్‌గా సైమన్ వాంగ్ వీ కుయెన్‌ను నియమించింది సింగపూర్‌.  ముందు, అతను జూలై 2015 నుండి జనవరి 2020 వరకు తైవాన్‌కు సింగపూర్ వాణిజ్య ప్రతినిధిగా ఉన్నారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)