Breaking News

kolkata: భారీ అగ్ని ప్రమాదం.. 300 దుకాణాలు దగ్ధం

Published on Sat, 11/15/2025 - 11:35

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఎజ్రా స్ట్రీట్‌లో శనివారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 300 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పక్కనే ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారిని సకాలంలో ఖాళీ చేయించడంతో ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కోల్‌కతా సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందిరా ముఖర్జీ ఈ ఘటనను ధృవీకరించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మంటలను అదుపు చేయడానికి  తొలుత ఆరు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో  మరో 20 అగ్నిమాపక యంత్రాలను  రప్పించాల్సి వచ్చింది. ఎజ్రా స్ట్రీట్‌లోని ఇరుకైన సందుల్లో గల ఎలక్ట్రికల్ వస్తువులు, చెక్క, ప్లైవుడ్ తదితర మండే స్వభావం గల పదార్థాలను నిల్వ చేసే దుకాణాలు, గోడౌన్లలో మంటలు వేగంగా వ్యాపించాయి.
 

దట్టమైన నల్లటి పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించడానికి  ఇబ్బంది పడ్డారు. అధికారులు ఆ ప్రాంతం చుట్టూ ఉన్న అన్ని రహదారులను మూసివేశారు. ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ తర్వాతే దర్యాప్తు జరుగుతుందని సీనియర్ అగ్నిమాపక, అత్యవసర సేవల అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

స్థానిక కౌన్సిలర్ సంతోష్ పాఠక్  అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. గత 22 సంవత్సరాలుగా భవనంలోని పేలవమైన భద్రతా ప్రమాణాల గురించి స్థానిక అధికారులకు, పోలీసులకు చాలాసార్లు లేఖలు రాసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని  ఆరోపించారు. కాగా ఇటీవల సెంట్రల్ కోల్‌కతాలోని ఆర్ ఎన్ ముఖర్జీ రోడ్‌లో ఒక గోడౌన్‌లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆ గోడౌన్‌లోని కంప్యూటర్లు, మోటార్లు, కారు విడిభాగాలు బూడిదయ్యాయి.

ఇది కూడా చదవండి: Bihar Election: డబుల్‌ షాక్‌లో ‘బిహార్‌ సింగం’

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)