Breaking News

కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

Published on Sun, 01/19/2025 - 17:04

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో ఆదివారం(జనవరి19) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి సెక్టార్‌ 19లో భక్తులు, సాధువుల కోసం వేసిన గుడారాల్లో రెండు వంట గ్యాస్‌ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో  గుడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. మొత్తం ముప్పై దాకా గుడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి.

అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి గుడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కుంభమేళాకు ఆదివారం ఒక్కరోజు 17 లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఇప్పటివరకు 7 కోట్లకుపైగా భక్తులు కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానమాచరించారు. 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ఎక్స్‌ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)