భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..

Published on Wed, 04/19/2023 - 18:00

ఓ బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్లు మేర దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌లోని ఓ ప్రైవేటు గోడౌన్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఆ గోడౌన్‌లో క్రాకరీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అందులో కోట్లాది రూపాయలు విలువ చేసే క్రాకర్లను నిల్వ ఉంచారు.

ఈ క్రమంలో అనూహ్యంగా గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో బాణాసంచాలన్ని ఒక్కసారిగా పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50కి పైగా భవనాలు త్రీవంగా దెబ్బతిన్నాయి. ఐతే ఈ గోడౌన్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టాయి.

భవనంలో పలువురు పౌరులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి మూడు కిలోమీటర్లు దూరం వరకు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

(చదవండి:  ఆ హీట్‌ స్ట్రోక్‌ హీట్‌ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగా కార్యక్రమాలు..)

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)