Breaking News

నేతాజీపై రాహుల్‌ గాంధీ పోస్ట్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Published on Mon, 01/27/2025 - 07:39

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై పశ్చిమ బెంగాల్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణంపై తన ఎక్స్‌ ఖాతాలో ఆయన చేసిన ఓ పోస్ట్‌ వివాదాస్పదంగా మారడమే ఇందుకు కారణం. అఖిల భారతీయ హిందూ మహసభ(ABHM) ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి. ఆరోజున రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) తన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అయితే అందులో ఆయన పేర్కొన్న నేతాజీ మరణం తేదీపై ఏబీహెచ్‌ఎం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు దక్షిణ కోల్‌కతాలోని భవానిపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

పీఎస్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎల్గిన్‌ రోడ్‌లోని నేతాజీ(Netaji) పూర్వీకుల నివాసం వద్ద రాహుల్‌ పోస్టుకు నిరసనగా అఖిల భారతీయ హిందూ మహసభ ధర్నాకు దిగింది. నేతాజీ తొలుత కాంగ్రెస్‌ను, ఆపై దేశాన్ని విడిచిపెట్టారు. అందుకు ఆ పార్టీ విధానాలే కారణం. ఇప్పుడు రాహుల్‌ గాంధీ దానిని కొనసాగిస్తున్నారేమో. రాబోయే రోజుల్లో దేశ ప్రజలే ఆయన్ని(రాహుల్‌ను) శిక్షిస్తారు. నేతాజీ జీవితంపై ఎవరైనా వక్రీకరణలు చేస్తే మా స్పందన ఇలాగా ఉంటుంది అని ఏబీహెచ్‌ఎం హెచ్చరించింది.  

నేతాజీ అదృశ్యం.. ఆయన మరణం చుట్టూరా నెలకొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  నేతాజీ ఆగష్టు 18, 1945న చనిపోయారంటూ రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. అదే తేదీన నేతాజీ సైగాన్‌ నుంచి మంచూరియా వెళ్తున్న క్రమంలో తైహోకూ (ప్రస్తుత తైపాయి) వద్ద ఆ విమానం కూలిపోయిందనే ప్రచారం ఒకటి ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)