Breaking News

‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్‌ఐఆర్‌.. కారణం ఇదే..

Published on Tue, 11/04/2025 - 13:53

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ కంపెనీ ‘ఫిజిక్స్‌వాలా’ చిక్కుల్లో పడింది. ఈ కంపెనీ రూపొందించిన ఒక ప్రకటన.. కశ్మీర్‌లోని పర్యావరణాన్న దెబ్బ‌తీసేవిధంగా ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలోని బాదర్‌కోట్ అడవుల గుండా ‘‘ఫిజిక్స్‌వాలా’ అధ్యాపకులు స్కార్పియో వాహ‌నాల్లో వెళుతున్న‌ట్లు చూపిన ఈ ప్రకటన పోలీసు దర్యాప్తుకు దారితీసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుల్మార్గ్ ఇఫ్తిఖర్ అహ్మద్ ఖాద్రీ ఫిర్యాదు మేరకు టాంగ్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్ఐఆర్ దాఖలైంది.

రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేని ఆరు నల్ల స్కార్పియో వాహనాల్లో ‘ఫిజిక్స్‌వాలా’  అధ్యాప‌కులు అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపించే ఈ యూట్యూబ్ వీడియోపై ఫిర్యాదు న‌మోద‌య్యింది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులను ప్రోత్స‌హించేందుకు  ఫిజిక్స్‌వాలా ఈ ఫుటేజ్ ఉపయోగించింది.  ఈ చ‌ర్య‌ భారత అటవీ చట్టం 1927, అటవీ సంరక్షణ చట్టం 1980కు విఘాతం క‌లిగించేలా ఉంది.  ‘ఫిజిక్స్‌వాలా’ పై అటవీ అధికారి చేసిన‌  ఫిర్యాదులో ఆ వాహనాలను పచ్చని పచ్చిక బయళ్లపై నడిపి, మూలికలు, వృక్షజాలానికి నష్టం కలిగించారని ఆరోపించారు.  ఈ ఫిర్యాదు మేర‌కు పోలీసులు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద.. ‘ఫిజిక్స్‌వాలా’  ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందంటూ కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం జ‌మ్ముక‌శ్మీర్‌లోని బుద్గాం పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసినందుకు ప‌లువురు యూట్యూబర్లపై కేసు నమోదయ్యింది. వారు పచ్చిక  బయళ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు వెల్ల‌డ‌య్యింది. దీంతో డిప్యూటీ కమిషనర్ బిలాల్ మోహిదిన వారిపై ఎఫ్ఐఆర్‌కు ఆదేశించారు. ఈ కేసుల‌పై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)