Breaking News

‘ఆపరేషన్‌ సిందూర్‌’ టైటిల్‌ కోసం క్యూ!

Published on Fri, 05/09/2025 - 05:03

ముంబై: ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత సైన్యం ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే.. ఆ పేరు కోసం బాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ‘మిషన్‌ సిందూర్‌’, ‘సిందూర్‌ : ది రివెంజ్‌’అంటూ ఆపరేషన్‌ కోడ్‌నేమ్‌ స్ఫూర్తితో సినిమా టైటిల్స్‌ రిజిస్టర్‌ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. 

ఆపరేషన్‌ తరువాత ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఐఎంపీపీఏ), ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్‌ ఇండియా ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్‌ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్‌ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఇది భారతదేశం గరి్వంచదగ్గ విషయం. అందుకే ఈ కథను సినిమా తీయాలని చాలామంది అనుకుంటున్నారు’ అని ఐఎంపీపీఏ కార్యదర్శి అనిల్‌ నగ్రాత్‌ తెలిపారు. 

ఒక వ్యక్తి ఎన్ని టైటిల్స్‌కైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే మొదట దరఖాస్తు చేసుకున్న వ్యక్తికే టైటిల్‌ కేటాయిస్తామని తెలిపారు. గతంలో కార్గిల్, ఉరీ, కుంభమేళాలకు కూడా ఇలాగే టైటిల్‌ అప్లికేషన్లు అధికంగా వచ్చాయి. టైటిల్‌ నమోదుకు దరఖాస్తు రుసుము రూ.300 ప్లస్‌ జీఎస్టీ, అత్యవసర ప్రాతిపదికన అయితే రూ.3,000 ప్లస్‌ జీఎస్టీగా నిర్ణయించారు. ఒక్కసారి టైటిల్‌ వచి్చన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్‌ తీసేసుకుంటారు. ఈ పేరుతో ట్రేడ్‌మార్క్‌ రిజి్రస్టేషన్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్‌.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది.  
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)