Breaking News

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 15 మంది మావోయిస్టులు మృతి

Published on Thu, 01/22/2026 - 11:33

చైబాసా: జార్ఖండ్‌ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ 15 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పతిరామ్‌ మాంఝీ అలియాస్‌ అనల్‌ మృతి చెందాడు. కాగా, పతిరామ్‌ తలపై ఆరు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.5కోట్ల వరకు రివార్డ్‌ ఉంది.

గత కొన్నేళ్లుగా మావోయిస్టు ఆర్గనైజేషన్‌లో అనల్‌ కీలకంగా పనిచేస్తున్నాడు. భద్రతా బలగాలపై భారీ దాడులకు ఇతడే వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌, సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కోబ్రా బెటాలియన్‌ 209తో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. 

కాగా, గత ఆదివారం(జనవరి 18వ తేదీ) ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా..  అంతకుముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. నలుగురు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

మార్చి నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం చెప్పినట్లుగానే.. ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించింది. ఆపరేషన్‌ కగార్‌ దెబ్బతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత కొంతకాలంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో అడవుల్ని వీడి.. జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అదే సమయంలో  ఎన్‌కౌంటర్‌లు కూడా కొనసాగుతున్నాయి.  మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)