Breaking News

Maha Kumbh: మిగిలినవి అమృత స్నానాలు కాదు.. కారణమిదే

Published on Tue, 02/04/2025 - 12:28

మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు  పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.

మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే  ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya)  ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.

నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.

ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)