Breaking News

రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్‌.. అసలు నిజం ఇదేనా?

Published on Fri, 06/09/2023 - 11:49

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా రెజ్లర్లు భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకరంగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోరాటానికి మైనర్‌ రెజ్లర్‌ తండ్రి రూపంలో ఊహించని షాక్‌ తగిలింది. ఆయన వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు, అది తప్పుడు ఫిర్యాదని ఆ మైనర్‌ రెజ్లర్‌ తండ్రి మీడియాకు తెలపడంతో ఒక్కాసారిగా అంతా అవాక్కయ్యారు.

ప్రస్తుతం మీరు ఇలా ఎందుకు మాట మారుస్తున్నారని విలేకరులు ఆయనను అడగగా.. ‘ఈ నిజం న్యాయస్థానం ద్వారా బయటకు రావడం కంటే ఇప్పుడు ఈ రకంగా బయటకు రావడమే మేలు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై వివరణగా.. 2022లో అండర్‌-17 చాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌ ఫైనల్స్‌లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్‌ డిప్యూటేషన్‌ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

అయితే కేవలం ఒక మ్యాచ్‌లో ఓటమికి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. మీకు అది ఒక్క పోటీనే కావచ్చని, కానీ అది తన కూతురుకు ఏడాది శ్రమకు ఫలితమని చెప్పారు. అంతేకాకుండా తన కూతురు ఓడిపోయిన అండర్‌-17 చాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌పై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని అధికారులు నాకు హమీ ఇచ్చారని, అందుకు ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

చదవండి: ‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. దేశానికి మరో ముప్పు ఉంది’

#

Tags : 1

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)