Breaking News

రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని..

Published on Sat, 06/24/2023 - 12:19

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తన ముక్కుపచ్చలారని ఇద్దరు కుమార్తెల ప్రాణం తీశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. 

ఈ ఘటన డెహ్రాడూన్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని డోయీవాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ పిల్లల అమ్మమ్మ అల్లుని ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేశవ్‌పురి డోయివాలా నివాసి ఆశుదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన చిన్న కుమార్తె రీనాకు ఐదేళ్ల క్రితం జితేంద్రతో వివాహమయ్యిందని పేర్కొంది. తరువాత వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారని, వారు ప్రస్తుతం పాలు తాగే వయసులో ఉన్నారని తెలిపింది.  

జితేంద్ర తన భార్య రీనాను తరచూ కొడుతుండేవాడు. కొన్నాళ్ల పాటు ఆమె భర్త పెట్టే బాధలను భర్తిస్తూ వచ్చింది. కొంతకాలం తరువాత పిల్లలను తండ్రి వద్దనే వదిలేసి, రీనా హైదరాబాద్‌ వెళ్లిపోయింది. దీంతో జితేంద్ర మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి పిల్లలు అడ్డు వస్తున్నారని భావించాడు. పిల్లలను అంతమెందించి  మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టాడు. అర్థరాత్రి ఆ చిన్నారుల గొంతు నులిమి హత్య చేశాడు. 

వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారులు మృతి చెందివుండటాన్ని గుర్తించిన వారి అమ్మమ్మ డోయీవాలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు గురించి ఎస్‌ఎస్‌ఐ రితేష్‌ షా మాట్లాడుతూ మృతిచెందిన చిన్నారుల అమ్మమ్మ తన అల్లుడే ఈ  హత్య చేశాడని ఆరోపిస్తున్నదని తెలిపారు. కాగా చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. నిందుతుని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతనిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. 

ఇది కూడా చదవండి: ఛాతీలో చాకు దిగబడి లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ మృతి.. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు