Breaking News

బాలిక గర్భం కేసులో సంచలనం.. అసలు నిందితుడు తండ్రి

Published on Tue, 06/02/2026 - 09:45

తమిళనాడు: వేలూరు సమీపంలోని పాఠశాల విద్యార్థి ని  కన్న తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు తాలూకాకు చెందిన 13 సంవత్సరాల బాలిక వేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదివింది. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన బాలికకు ఉన్నపళంగా అనారోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. 

అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక రెండు నెలలు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. వీటిపై ఆసపత్రి నిర్వాహకులు బాలిక మైనర్‌ కావడంతో వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలూరు మహిళా పోలీసులు బాలిక వద్దకు చేరు కొని విచారణ జరపగా ఆ సమయంలో ఆ బాలిక కాట్పాడికి చెందిన ఒక యువకుడిని ప్రేమించినట్లు అతను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసేందుకు అతని వివరాలు, ఫొటో, చిరునామా వివరాలు అడిగారు. ఆ సమయంలో బాలిక మాటలు తడబడుతూ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన పోలీసులు బాలిక వద్ద సమగ్రమైన విచారణ చేపట్టారు. 

ఆ సమయంలో తన తండ్రి పెయింటర్‌గా పనిచేసేవాడని రాత్రి వేళల్లో మద్యం మత్తులో తన తల్లి నిద్రించిన సమయంలో తనను బెదిరించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని బయటకు చెపితే కుటుంబంలోని అందరినీ హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అదే విధంగా తన కన్న తండ్రి కారణంగా తాను గర్భం దాల్చిన విషయాన్ని బయట పెట్టకూడదనే కారణంతోనే కాటా్పడిలోని ఒక యువకుడిపై చెప్పినట్లు తెలిపింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కన్న కుమార్తెను తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన వేలూరు పట్టణంలో సంచలనం రేపింది.   

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)