Breaking News

భర్తపై దాడి, భార్యను వేధించి.. కొడుకును నగ్నంగా మార్చి..!

Published on Mon, 01/05/2026 - 17:33

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసి, అతడి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా.. వారి కుమారుడిని నగ్నంగా నిల్చోబెట్టి వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన జనవరి రెండో తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో రాజేష్‌ గార్గ్‌ అనే వ్యక్తి తన ఇంటి బేస్‌మెంట్‌పై జిమ్‌ నిర్వహిస్తున్నాడు. జిమ్‌ బాధ్యతను సతీష్‌ యాదవ్‌ అనే వ్యక్తి చూసుకుంటున్నాడు. అయితే, సదరు జిమ్‌ హక్కుల విషయంలో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో రాజేష్, అతడి భార్య.. సతీష్‌పై ఆరోపణలు చేశారు. సతీష్ యాదవ్ తమను మోసం చేశారని, తమ ఆస్తిని స్వాధీనం చేసకున్నాడని ఆరోపించారు. దీని గురించి ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు.

అనంతరం, విషయం పెద్దది కావడంతో సతీష్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. జిమ్‌పై తమ హక్కు గురించి ప్రశ్నించినందుకు దాడి చేయాలని ప్లాన్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండో తేదీన సతీష్ యాదవ్ మరో ముగ్గురితో కలిసి వచ్చి.. రాజేష్‌ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. రాజేష్‌పై దాడి చేసిన దుండగులు.. అతడి భార్య జుట్టుపట్టుకుని లాగి, దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఇది గమనించిన తమ కొడుకు అక్కడికి రాగా.. అతడిపై కూడా దాడి చేసి, కొంతదూరం తీసుకెళ్లి దుస్తులు విప్పించారు. వీధిలోకి లాక్కెళ్లి ఇనుప రాడుతో దాడి చేయగా, తీవ్ర రక్తస్రావం జరిగింది.  ఈ ఘటనలో గార్గ్ తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సతీష్ యాదవ్‌ను అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభం యాదవ్, ఓంకార్ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)