Breaking News

శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు

Published on Thu, 03/20/2025 - 07:10

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్-హర్యానాలోని శంభు సరిహద్దు(Shambhu border) వద్ద 13 నెలలుగా ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రైతులు నిర్మించిన తాత్కాలిక వేదికను, టెంట్లను  తొలగించారు. రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పాంధర్ సహా దాదాపు 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ పోలీసుల చర్యలపై బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

పటియాలా ఎస్ఎస్పీ నానక్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘శంభు సరిహద్దులో రైతులు చాలా కాలంగా నిరసనలు చేపడున్నారు. డ్యూటీ మేజిస్ట్రేట్(Duty Magistrate) సమక్షంలో పోలీసులు రైతులకు ముందస్తుగా హెచ్చరిక జారీచేశాకనే, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశాం. కొంతమంది రైతులను బస్సులలో వారి ఇంటికి పంపించామని అన్నారు. ఇక్కడి నిర్మాణాలు, వాహనాలను కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. రోడ్డును క్లియర్ చేసి, వాహనాల రాకపోకల కోసం తెరుస్తామన్నారు.  రైతుల నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో తాము ఎటువంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, రైతులు తమకు సహకరించారని నానక్ సింగ్ అన్నారు.

ఈ తొలగింపులకు ముందుగా ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. శంభు సరిహద్దు వద్ద రైతులు నిర్మించిన తాత్కాలిక షెల్టర్లను కూల్చివేయడానికి బుల్డోజర్లను ఉపయోగించారు. పంజాబ్ పోలీసులు.. రైతు నాయకులను అదుపులోకి తీసుకోవడంపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ తాను పంజాబ్ ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నానని,  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గుపడాలని, కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలకు పరిష్కారం  దొరకాలని ఆప్‌ ప్రభుత్వం కోరుకోవడంలేదని ఆయన విమర్శించారు.

ఇది కూడా చదవండి: సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)