Breaking News

ఢిల్లీ చలో: శంభు సరిహద్దులో రైతు మృతి

Published on Sat, 02/17/2024 - 08:05

ఛండీగడ్‌: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్‌, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, రైతుల ర్యాలీ, నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శంభు సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. మరోవైపు.. నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. 

వివరాల ప్రకారం.. రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకరంగా మారుతున్నాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. ఢిల్లీవైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుల నిరసనల్లో భాగంగా కొందరు వ్యక్తులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో, వారిని తరిమికొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. 

ఇక, శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్‌ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు.. పంజాబ్‌, హర్యానా రైతులకు మద్దతు తెలుపుతూ త్రిపురలో రైతులు, సీఐటీయూ వర్గాలు ర్యాలీలు చేపట్టాయి. రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్‌ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)