Breaking News

పాటలతో పులులు పరార్‌!

Published on Mon, 12/15/2025 - 05:16

పిలిభిత్‌: సంగీతంతో ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారని మనకు తెలుసు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు. కత్తులు, కర్రలకు బదులుగా సంగీతంతో, అదీ మామూలు సినిమా పాటలతోనే వాటిని అదరగొడుతున్నారు. సంగీత ధ్వనుల ధాటికి పులులు అడవిని దాటి పొలాలు, జనావాసాల వైపు రావడానికి జంకుతున్నాయట. ఇప్పుడిక తాము ఊరు బయటకు, పొలాలు, చెరుకు తోటల్లోకి నిర్భయంగా వెళ్లివస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. 

ఇంతకీ వీళ్లు ఎలా పులుల్ని వణికిస్తున్నారంటే.. మాలా అటవీ రేంజ్‌లో పిలిభిత్‌ టైగర్‌ రిజర్వు ఉంది. పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని డజను వరకు గ్రామాలున్నాయి. గ్రామాల చుట్టూ పొలాలు, దట్టంగా చెరుకు తోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టైగర్‌ రిజర్వులోని పులులు పొలాలు, చెరుకుతోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆవాసాల సమీపంలో సంచరిస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు శూన్యం. దీంతో, జమునియా గ్రామానికి చెందిన కృష్ణకుమార్‌ ఓ ఉపాయం కనిపెట్టారు. 

‘పెద్ద శబ్దాలను వింటే, జంతువులు భయపడి దూరంగా వెళ్లిపోతాయని నాకు తెలుసు. ఇదే ఉపాయాన్ని అమల్లో పెట్టా. సౌర శక్తితో పనిచేసే మైక్‌ సెట్‌ను మా చెరుకు తోట వద్ద ఏర్పాటు చేశాను. మైక్‌ ద్వారా పెద్ద శబ్దంతో వచ్చే సంగీతం, సినిమా పాటలతో పులి వంటి జంతువులు మా ఛాయలకు కూడా రావడం లేదు. మా పొలాలకు దూరంగా వెళ్లిపోతున్నాయి. నన్ను చూసి, మిగతా రైతులు కూడా ఇదే ఉపాయాన్ని అమలుచేస్తూ సత్ఫలితాలు సాధించారు. మా ఊరే కాదు, అజిత్‌పూర్, రామ్‌నగరియా, మహువా, మలా ఘెరా, రిచ్చోలా, బసంత్‌పూర్‌లాంటి పులుల భయమున్న గ్రామాల రైతులూ ఇదే ఉపాయం అమలు చేస్తున్నారు’అని కుమార్‌ తెలిపారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)