Breaking News

మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు.. అప్పటి వరకు నో యాక్షన్‌

Published on Wed, 02/14/2024 - 20:47

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్‌లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు. 

చండీగఢ్‌లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్‌ గోయల్ ఆహారం,  పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,.

కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు.  ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు.

అంతకముందు కేంద్రమంత్రి అర్జున్‌ ముండా మాట్లాడుతూ..  రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)