Breaking News

కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం

Published on Wed, 01/10/2024 - 17:16

బెంగళూరు: బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించారు. రుణ బకాయిలను రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కర్ణాటక అసెంబ్లీ బయట మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తమపై కిరోసిన్ పోసుకున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బెంగుళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో 2016లో అల్లం సాగు వ్యాపారం చేసేందుకు రూ.50 లక్షలు రుణం తీసుకున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ అల్లం వ్యాపారం నష్టాలను చవిచూసింది. దీంతో సహాయం కోరుతూ బాధిత కుటుంబం కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌ను ఆశ్రయించింది. లోన్ వడ్డీని తగ్గిస్తామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ బ్యాంకు అధిక రేట్లు విధిస్తూనే ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈఎమ్‌ఐలను తిరిగి చెల్లించడంలో కుటుంబం విఫలమైనందున బకాయిలను తిరిగి పొందేందుకు బాధితుల ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేశారు. దీనితో మనస్థాపానికి గురైన కుటుంబం అసెంబ్లీ ఎదుట ఆత్మాహుతి చేసుకోవడానికి పాల్పడ్డారు. రూ.3 కోట్ల విలువైన నివాసాన్ని కేవలం రూ.1.41 కోట్లకు బ్యాంకు అధికారులు వేలం వేశారని నిస్సహాయతను వెలిబుచ్చారు.

ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)