గుండు కొట్టించుకుంటే 15 వేలు..!

Published on Wed, 07/29/2026 - 07:56

తమిళనాడు: సేలం జిల్లాలోని ఆత్తూరు సమీపంలో ఉన్న పుదుకోతమ్మడి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు ఆదివారం రాత్రి సుమారు 8 గంటలకు ఆమె సెల్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆత్తూరు తాలూకా కార్యాలయం నుండి తహసీల్దార్ అని చెప్పుకుంటూ, ఆ మహిళ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా అడిగారు. కరోనా వంటి కొత్త వ్యాధులు నిరంతరం వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశాలలో ప్రజలు గుండు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారి నుండి తప్పించుకుంటున్నారు. 

ఈ విధంగా గుండు చేయించుకుంటే, వారికి ఈ వ్యాధి సోకదు. ప్రభుత్వం కూడా రూ. 15 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు. దీనిని నమ్మి 20 మంది గుండు కొట్టించుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్న తర్వాత.. అజ్ఞాత వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసమని గ్రహించి మిగిలిన వారు గుండు చేయించుకోకుండా జాగ్రత్తపడ్డారు. కాగా కొత్త పద్ధతిలో మహిళలను మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు పోలీసులను కోరారు.

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)