Breaking News

ప్రధాన మీడియాకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు...పరిహారం ఇవ్వాల్సిందే

Published on Fri, 02/28/2025 - 05:59

న్యూఢిల్లీ: కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న ఆన్‌లైన్‌ మీడియా ప్లాట్‌ఫాంల వల్ల వార్తాపత్రికలు, వార్తా చానళ్ల వంటి సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘సంప్రదాయ మీడియా సంస్థలకు సంబంధించిన కంటెంట్‌ను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు విస్తారంగా వాడుకుంటున్నాయి. 

ఇందుకు వాటికవి సముచిత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. గురువారం స్టోరీబోర్డ్‌18 డీఎన్‌పీఏ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. 

‘‘ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు కృత్రిమ మేధ (ఏఐ) తదితరాల సాయంతో కంటెంట్‌ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తూ పాఠకులు, వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో యువత సంప్రదాయ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్‌ మీడియావైపు మళ్లుతోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా తన పాత్రను సమీక్షించుకోవాల్సి ఉంది. శరవేగంగా చోటుచేసుకుంటున్న కొత్త తరం మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం’’ అని సూచించారు. 

ఈ మార్పిడి క్రమంలో సంప్రదాయ మీడియాకు అన్నివిధాలా దన్నుగా నిలిచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు తమ ఆదాయంలో సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలకు సముచిత వాటా ఇచ్చేలా పలు దేశాల్లో ఇప్పటికే చట్టాలు అమల్లో ఉన్నాయని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘భారత్‌లో మాత్రం ఇంకా ఆ పరిస్థితి లేదు. డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు ఇప్పటికీ ప్రధాన స్రవంతి సంస్థల కంటెంటే ప్రధాన వనరు. కానీ వాటి ఆదాయంలో మాత్రం ప్రధాన మీడియా సంస్థలకు తదనుగుణంగా అందడం లేదు’’ అన్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)