Breaking News

శ్రీరాముడి ర్యాలీలో ఘర్షణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌ సీరియస్‌

Published on Mon, 01/22/2024 - 18:19

ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హెచ్చరించారు. ముంబై శివారుల్లో ఆదివారం కార్లు, బైకులతో ర్యాలీ తీసిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన డిప్యూటీ​ సీఎం దేవేంద్ర ఫడ్నవీసు స్పందించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు.

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల నేపథ్యంలో 10-12 మంది కార్లు, మెటర్‌ సైకిల్స్‌తో  ఆదివారం రాత్రి ముంబై శివారుల్లో శ్రీరాముడి నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. మరో వర్గం టపాసులు పేల్చింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ అధారంగా ఈ ఘటనపై  దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)