మహా ధురంధర్‌ ఫడ్నవీస్‌

Published on Sat, 01/17/2026 - 06:50

మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించగా, ఈ విజయానికి ప్రధాన శక్తిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు ప్రతిధ్వనిస్తోంది. ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రకటన “మా గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం” అనేది కేవలం నినాదంగా కాకుండా, ఫలితాల్లో నిజమైంది. ఈ విజయంతో ఆయనకు అట్టడుగు స్థాయి ప్రజల నుండి గట్టి ఆదరణ ఉందని స్పష్టమైంది.

ముఖ్యంగా ముంబైలో తన పట్టును నిలుపుకోవడం ఫడ్నవీస్‌ కోసం కీలకంగా మారింది. ఠాక్రే సోదరులు ఉద్ధవ్‌, రాజ్‌ 20 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఒకటయ్యే ప్రయత్నం చేసినా, ఫడ్నవీస్‌ వ్యూహాలు వారి ఆశలపై నీళ్లుజల్లాయి. ప్రచారంలో ఆయన స్వయంగా ముందుండి, ప్రతి కార్పొరేషన్‌లోనూ కలియదిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వయోజన ఓటర్లతో పాటు యువత, ముఖ్యంగా జెన్‌ జెడ్‌ తరాన్ని తన సూటి.. ఆధునిక ప్రచార శైలితో ఆకట్టుకున్నారు.

దక్షిణ భారతీయులను ముంబై నుంచి వెళ్లగొడతామన్న ఠాక్రేల హెచ్చరికల నడుమ, ఫడ్నవీస్‌ వారిని అక్కున చేర్చుకోవడం ఆయనకు అదనపు మద్దతు తెచ్చింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ ప్రాంతీయులు ఆయనను తమవాడిగా భావించారు. అంతేకాకుండా, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారావీ అభివృద్ధి ప్రాజెక్టును ప్రకటించడం.. ముంబై వాసుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టడం ఆయనకు విశేష ఆదరణను తెచ్చింది.

ఈ విజయంతో 54 ఏళ్ల ఫడ్నవీస్‌ మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కేవలం ఒక నాయకుడిగానే కాకుండా, వ్యూహకర్తగా, ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. మహాయుతి కూటమి విజయాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చిన హీరోగా ఆయన పేరు మరాఠా రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)