Breaking News

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?

Published on Mon, 02/26/2024 - 07:21

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రస్తుతం దేశ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. సందేశ్‌ఖాలీలో మహిళలను కొందరు టీఎంసీ నేతలు లైంగికంగా వేధించారని, వారి భూములు ఆక్రమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపధ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పశ్చిమ బెంగాల్‌లోని మమత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని  పలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సందేశ్‌ఖాలీకి వెళ్తున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిని విడుదల చేశారు. ఇప్పుడు ఆ నిజనిర్ధారణ బృందం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌తో సమావేశమైంది. వారు సందేశఖలీ అంశంపై తమ అభిప్రాయాన్ని గవర్నర్‌ ముందు వెల్లడించారు. 

సందేశ్‌ఖాలీకి వెళ్లేందుకు తాము వెళుతుండగా పోలీసులు తమను అడ్డుకున్నారని వారు గవర్నర్‌కు తెలిపారు. దాదాపు గంటన్నర పాటు తమను నిర్బంధించి, ఆ తరువాత విడుదల చేశారని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము గవర్నర్‌ను కోరామని నిజనిర్ధారణ బృందం మీడియాకు తెలిపింది. రాష్ట్రంలో సెక్షన్ 144 అమలు చేయాలని కోరామని, దేశ పౌరులు స్వేచ్ఛగా తిరగలేకపోవడం కన్నా దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదని వారు వాపోయారు. 

తమ అరెస్టు చట్ట విరుద్ధమని ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ గవర్నర్‌తో భేటీ సందర్భంగా పేర్కొంది. కాగా ఈ బృందానికి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, ఇతర సభ్యులు నాయకత్వం వహించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ఆరోపణలపై వెంటనే డీజీపీ నుంచి నివేదిక తీసుకోవాలని గవర్నర్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)