Breaking News

ఈ వీడియోను మీరూ నమ్మారా? రాజ్‌నాథ్‌ సింగ్‌ అలా చెప్పలేదు..

Published on Thu, 07/23/2026 - 21:00

న్యూఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిరసనకారులను బెదిరించినట్టు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వీడియోను పాకిస్థాన్‌ ప్రచార నెట్‌వర్క్‌ తప్పుడు సమాచారంతో వ్యాప్తి చేసినట్టు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ వెల్లడించింది.

పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఆ ప్రచారాన్ని నకిలీగా తేల్చింది. వైరల్‌ వీడియోను కృత్రిమంగా రూపొందించారని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచార ప్రచారంలో భాగంగా పాకిస్థాన్‌ ప్రచార అకౌంట్లు దాన్ని విస్తృతంగా షేర్‌ చేస్తున్నాయని తెలిపింది.

ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న తప్పుడు వీడియోతో పాటు రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడిన ఎలాంటి మార్పులు చేయని వీడియోను కూడా ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం విడుదల చేసింది.

ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. “ఈ వీడియో నకిలీ, కృత్రిమ మేధతో రూపొందించారు. ఢిల్లీ నిరసనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అలాంటి ప్రకటన చేయలేదు” అని ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం తెలిపింది.

ధ్రువీకరణ లేని సమాచారాన్ని షేర్‌ చేయవద్దని పీఐబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద పోస్టులను పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగానికి తెలియజేయాలని సూచించింది. నిజమైన సమాచారం కోసం అధికారిక సోర్సులనే నమ్మాలని కోరింది.

రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏమన్నారు?
బుధవారం రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌-యూజీ) 2026 ప్రశ్నపత్రం లీక్‌ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.

విద్యార్థులను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో.. “ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశ విద్యార్థులను, యువతను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు కొందరు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)