Breaking News

ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి నిజంగా అలా అన్నారా?

Published on Wed, 01/15/2025 - 14:10

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆ మధ్య పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు.. ఎంత దుమారం రేపాయో తెలియంది కాదు. దానికి ఇప్పుడు కొనసాగింపుగా.. ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా ఇన్ఫోసిస్‌ మూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

ఇంతకు ముందు వారంలో 70  పనిగంటల(70 Hours) ఉండాల్సిందేనని బహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చిన ఇన్ఫోసిస్‌ మూర్తి.. ఇప్పుడు యువతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత పరిమితంగా ఉంటే దేశానికి అంత మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే జీవితంలో విజయం బాట పడతారు అంటూ ఆయన మాట్లాడారు. 

ఈ మేరకు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. దీంతో ఆ వార్త ఆధారంగా నారాయణమూర్తి(Narayana Murthy)పై సోషల్‌ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఆయనకేమైందంటూ.. పలువురు విమర్శించడం, ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు విషయం తెలిసింది. 

పీటీఐ ఫ్యాక్ట్‌ చెక్‌(PTI Fact Check)లో నెట్టింట్‌ హల్‌చల్‌ చేస్తున్న ఆ వార్త తాలుకా స్క్రీన్ షాట్ ఫేక్‌గా నిర్ధారణ అయ్యింది. అది డిజిటల్‌గా ఎడిట్‌ చేసిందని తేలింది. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ కూడా తన సోషల్‌ మీడియా ద్వారా ధృవీకరించింది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)