Breaking News

‘‘నీళ్లు ఇవ్వలేదని కాల్పులు జరిపారు’’

Published on Wed, 06/12/2024 - 11:53

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా, హీరానగర్ పరిధిలోని సైదా సోహల్ గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలోకి ఉగ్రవాదులు ప్రవేశించారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో  ఓంకార్‌ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతను ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు.  

కథువాలోని జీఎంసీలో చికిత్స పొందుతున్న ఓంకార్‌ పోలీసులతో మాట్లాడుతూ తమ ఇంటి బయట అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించిందని, దీంతో తామంతా తలుపులు వేసుకుని, లోపలికి వెళ్లే ప్రయత్నిం చేస్తుండగా కాల్పులు జరిగాయన్నాడు. ఇంతలో ఉగ్రవాదులు లోనికి ప్రవేశించి తమ ఇంటిలోని ఒక మహిళను నీరు అడిగారని, ఆమె నిరాకరించడంలో కాల్పులు జరిపారని ఓంకార్‌ తెలిపాడు. వెంటనే తాము ఇంటిలోని మూలల్లో దాక్కున్నామన్నారు. సమపంలోని ఇళ్లలోని వారు కూడా ఇంటి తలుపులు వేసుకున్నారన్నారు.

ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుదాడి ప్రారంభించి,  ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ప్రస్తుతం అతని సహచర ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు భుజాలపై బ్యాగులు ధరించారు. వారి దగ్గర ఆయుధాలు  ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ దరిమిలా సైదా సోహల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనకర వాతావరణం నెలకొంది. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)