Breaking News

విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే

Published on Thu, 06/12/2025 - 17:40

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తం ప్రయాణికులు దుర్మరణం చెందినట్ల తెలుస్తోంది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతిచెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు.

విమానం అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు.

విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..
ఈ ప్రమాదం కూలిన వెంటనే దాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి.. పీటీఐ(ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా)తో మాట్లాడారు. ‘ నేను విమానం కూలినప్పుడు నేను ఇంటిలోనే ఉన్నా. ఒక్కసారిగా బయట నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఏమైందని బయటకి వచ్చి చూశాను. చుట్టూ దట్టంగా పొగ వ్యాపించి ఉంది. అక్కడకు వెళ్లి చూశాను. విమానం కూలిపోయి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అక్కడంతా భయానకంగా కనిపించింది’ అని పేర్కొన్నారు. 

 

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు