Breaking News

విమాన ప్ర‌మాదం.. ప్ర‌త్య‌క్ష సాక్షి ఏం చెప్పారంటే..

Published on Wed, 01/28/2026 - 14:36

బారామ‌తి: ఎన్సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న ప్ర‌త్యేక విమానం బారామ‌తి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ కుప్ప‌కూలిపోయింది. వెంట‌నే మంట‌లు వ్యాపించ‌డంతో విమానంలో ఉన్న‌ అజిత్ ప‌వార్‌తో పాటు ఐదుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. విమానం కూలిపోవ‌డానికి కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

ప్ర‌త్య‌క్ష సాక్షులు మాత్రం ఇది ఘోర ప్ర‌మాద‌మ‌ని చెబుతున్నారు. విమానం కూలిన వెంట‌నే నాలుగైదు పేలుళ్లు సంభ‌వించాయ‌ని వెల్ల‌డించారు. భారీ ఎత్తున మంట‌లు వ్యాపించ‌డంతో ఎవ‌రినీ కాపాడ‌లేక‌పోయిన‌ట్టు చెప్పారు. త‌మ క‌ళ్లెదుటే అజిత్ ప‌వార్ మంట‌ల్లో కాలిపోవ‌డం క‌ల‌చివేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ క‌ళ్లెదుటే అజిత్ ప‌వార్ స‌హా ఐదుగురు మంట‌ల్లో కాలిపోవ‌డం క‌ల‌చివేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

''విమాన‌ ప్ర‌మాదాన్ని ప్ర‌త్య‌క్షంగా చూశాను. చాలా బాధాక‌ర‌మైన ఘ‌ట‌న‌. విమానం కిందకు దిగేట‌ప్పుడు అది కూలిపోతున్నట్టుగా అనిపించింది. క్ష‌ణాల్లో నా క‌ళ్లెదుటే అది కుప్ప కూలింది. వెంటనే మేమంతా అక్క‌డికి పరుగెత్తికెళ్లాం. విమానంలో మళ్లీ 4-5 పేలుళ్లు సంభవించాయి. దీంతో చాలా మంది అక్క‌డికి చేరుకున్నారు.  విమానంలో ఉన్న వారికి కాపాడాలని అనుకున్నాం. కానీ భారీగా మంట‌లు వ్యాపించ‌డంతో స‌హాయం చేయ‌లేక‌పోయాం. అజిత్ పవార్ విమానంలోనే ఉన్నారని తెలిసి చాలా బాధ‌ప‌డ్డాం. ఈ వేదన‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌లేన''ని ప్ర‌త్య‌క్ష సాక్షి ఒక‌రు మీడియాతో చెప్పారు. 

విమాన ప్ర‌మాదంపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. అజిత్ ప‌వార్ కుటుంబ స‌భ్యులు, మ‌హారాష్ట్ర రాజ‌కీయ నేత‌లు బారామ‌తికి త‌ర‌లివెళ్లారు. కాగా, అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాద దృశ్యాలు రికార్డైన సీసీ కెమెరా ఫుటేజి వైర‌ల్‌గా మారింది. 

విమాన ప్ర‌మాదం.. ఘ‌ట‌నా స్థ‌లంలో ప‌రిస్థితి ఇలా..

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)