Breaking News

జైశంకర్‌ భద్రత పెంపు

Published on Thu, 05/15/2025 - 06:19

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్‌ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. తాజా సమీక్ష అనంతరం మంత్రి కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. 

ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్‌కు భద్రతను 2023లో వై నుంచి జెడ్‌ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్‌పీఎఫ్‌ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. 

జెడ్‌ కేటగిరీలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, ఎస్కార్ట్‌ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్‌ జెడ్‌–ప్లస్‌ (అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైజన్‌), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్‌ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్‌పీఎఫ్‌ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)