పాడ్‌‘కాస్ట్‌’.. కబుర్లకు కాసులు

Published on Wed, 01/28/2026 - 05:28

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ :  నాడు రేడియో–నేడు పాడ్‌కాస్ట్‌.. ఒకప్పుడు మన తాతయ్య తరం వాళ్లు రేడియోలు చెవి దగ్గర పెట్టుకుని వింటూ కనిపించేవాళ్లు. ఇప్పుడు మనం ఫోన్‌లు చేత్తో పట్టుకుని పాడ్‌కాస్ట్‌లు వింటున్నాం. సీన్‌ మారింది కానీ, ‘వినే’ అలవాటు మాత్రం మారలేదు. పాడ్‌కాస్ట్‌లు వినడంలో ప్రపంచంలోనే ఇండియా ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానంలో ఉంది.  

వినటం మన డీఎన్‌ఏలోనే ఉంది!
కబుర్లు వినే అలవాటు భారతీయుల డీఎన్‌ఏలోనే ఉన్నట్లుంది. ఆ అలవాటుకు తగ్గట్లుగా పాడ్‌కాస్ట్‌లు రకరకాల సబ్జెక్టులపై కమ్మటి లోకాభిరామాయణం వినిపిస్తున్నాయి. ఏమీ తోచక బోర్‌ కొడుతున్నప్పుడు పాడ్‌కాస్ట్‌.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినప్పుడు పాడ్‌కాస్ట్‌.. నాలెడ్జ్‌ కోసం, వినోదం కోసం, మనశ్శాంతి కోసం పాడ్‌కాస్ట్‌... ఇలా పాడ్‌కాస్ట్‌లనేవి భారతదేశపు అధునాతన రేడియోలు అయ్యాయి. తక్కువ ధరకే లభ్యమౌతున్న వై–ఫై, 4జీ, 5జీ డేటా..పాడ్‌కాస్ట్‌లకు అమితమైన ప్రజాదరణదక్కడానికి ప్రధాన కారణాలు.

పాడ్‌కాస్ట్‌లకు డబ్బులే డబ్బులు
ఇండియాలో పాడ్‌కాస్ట్‌ రంగంఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం. వాణిజ్య ప్రకటనదారులు కూడా ‘వినేవారు మనవారే’ అన్నంత ఉదారంగా, పాడ్‌కాస్ట్‌లకు ప్రకటనలను కుమ్మరిస్తున్నారు.

ఏం వింటున్నారు?
కామెడీ అనుకుంటున్నారు కదూ! కాదట. ‘జ్ఞానాన్ని’ ఎక్కువగా ఇష్టపడుతున్నారట!అందులోనూ భక్తి, మోటివేషన్, బిజినెస్‌ అంటే చెవులు కోసుకుంటారని స్పాటిఫై, యూట్యూబ్‌ వార్షిక నివేదికలు చెబుతున్నాయి. 

ఎక్కడ వింటున్నారు?
ప్రధానంగా యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లనువింటున్నారు. యూట్యూబ్‌లోనే వీడియో పాడ్‌కాస్ట్‌లను చూస్తున్నారు. అలాగే కొన్ని మ్యూజిక్‌ యాప్స్‌ కూడా పాడ్‌కాస్ట్‌లనుఅందిస్తున్నాయి.  

2026లోపాడ్‌కాస్ట్‌లు ఎలాఉండబోతున్నాయి?
లోకల్‌ ఫీల్‌ :    ఇంగ్లిష్‌ను మించి తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఇతర భాషల్లో పాడ్‌కాస్ట్‌లు హోరెత్తించబోతున్నాయి.
ఏఐ వాయిస్‌ :    నిజమైన మనుషుల స్థానంలో ఏఐ రోబోలే మనకు పాడ్‌కాస్ట్‌లను వినిపిస్తాయి.
లైవ్‌ షోలు :    కేవలం ఫోన్‌లలోనే కాదు, స్టేజ్‌ మీద కూడా పాడ్‌కాస్ట్‌లను చేసి టికెట్స్‌ విక్రయిస్తారు. 
(ఆధారం : గ్రాండ్‌ వ్యూ రీసెర్చ్‌ అండ్‌ మార్క్‌ఎన్‌టెల్‌ అడ్వైజర్స్‌)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)