Breaking News

అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుత అనుభూతి

Published on Sat, 07/05/2025 - 05:36

న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో వారం రోజులు పూర్తి చేసుకున్నారు. సహచర వ్యోమగాములతో కలిసి ఇప్పటికే భూమిని 113 సార్లు చుట్టేశారు. 40.66 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 12 రెట్ల దూరంతో సమానం. ఐఎస్‌ఎస్‌లో తన అనుభవాన్ని శుభాంశు శుక్లా శుక్రవారం పంచుకున్నారు. 

మన భారతీయ ఆమ్‌ రస్, గాజర్‌కా హల్వా, మూంగ్‌దాల్‌ హల్వా రుచులు ఆస్వాదిస్తున్నానని, వాటిని సహచరులతో పంచుకుంటున్నానని చెప్పారు. ఇతర దేశాల వంటకాలను సైతం రుచి చూస్తున్నానని తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఐఎస్‌ఎస్‌ నుంచి సంభాషించారు. అలాగే హామ్‌ రేడియో ద్వారా బెంగళూరులోని యూఆర్‌ఎస్సీ సైంటిస్టులతో మాట్లాడారు. ఇక్కడంతా అద్భుతంగా ఉందని, తామంతా చక్కగా కలిసి ఉంటున్నామని పేర్కొన్నారు. 

వేర్వేరు దేశాలకు చెందిన ఆహార పదార్థాలను ఒకరికొకరం పంచుకుంటున్నామని వెల్లడించారు. వేర్వేరు దేశాల వ్యక్తులతో కలిసి పని చేయడం ఉత్సాహకరమైన అనుభవమని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూగోళాన్ని కళ్లారా వీక్షించడం మాటల్లో చెప్పలేని అద్భుత అనుభూతిని ఇస్తోందని వివరించారు. అత్యంత ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1984లో రాకేశ్‌ శర్మ ఏడు రోజుల 21 గంటల 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. శుభాంశు శుక్లా ఆ రికార్డును అధిగమించారు.          
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)