Breaking News

చంపినా సరే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా 

Published on Thu, 08/06/2026 - 06:03

న్యూఢిల్లీ: జైలు శిక్ష లేదా మరణ శిక్షకు తాను భయపడబోనని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్‌ నేత షేక్‌ హసీనా తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్‌ను సరైన మార్గంలో నడిపించడమే ధ్యేయంగా ఈ ఏడాది డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బుధవారం ఆమె ఆడియో ఆధారిత వర్చువల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు షేక్‌ హసీనాను చూడలేకపోయారు.

 కేవలం ఆమె గొంతును మాత్రమే వినగలిగారు. భారీ నిరసనల నేపథ్యంలో 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడడం ఇదే మొదటిసారి. ‘‘నాకు తెలుసు.. వాళ్లు(బంగ్లాదేశ్‌ ప్రభుత్వం) నన్ను జైల్లో పెట్టొచ్చు లేదా చంపేయొచ్చు. అయినా సరే నా వాళ్లతో ఉండటానికి నేను ఇంటికి తిరిగి వెళ్తాను’’అని షేక్‌ హసీనా స్పష్టంచేశారు. భారతదేశాన్ని బంగ్లాదేశ్‌కు గొప్ప మిత్రదేశంగా అభివరి్ణంచారు. 

కష్టకాలంలో భారత్‌ ఎల్లప్పుడూ తమ దేశానికి అండగా నిలిచిందని పేర్కొన్నారు.  బంగ్లాదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి షేక్‌ హసీనా ప్రస్తావించారు. తాను స్వదేశానికి తిరిగి వెళ్లడం అధికారం కోసం కాదని, బంగ్లాదేశ్‌ను తిరిగి అభివృద్ధి, లౌకికవాదం, సంక్షేమం వైపు నడిపించేందుకేనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే తన సొంత ప్రజల మధ్య ఉండటానికి తిరిగి వెళ్తానని వివరించారు. తన ప్రియమైన దేశ ప్రజలు బాధపడుతుండగా వారికి దూరంగా ఉండలేనని వ్యాఖ్యానించారు.

తనను నిర్బంధించినా, జైలుకు పంపించినా, తప్పుడు కేసుల్లో ఇరికించినా వెనక్కి తగ్గబోనని అన్నారు. ప్రజల పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా అడ్డుకొనే శక్తి భయానికి లేదని ఉద్ఘాటించారు. స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) ప్రభుత్వంతో ఎటువంటి అనధికారిక చర్చలు జరిపే అవకాశం లేదని కొట్టిపారేశారు. అవామీ లీగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. షేక్‌ హసీనా ప్రస్తుతం భారత్‌లో గుర్తుతెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు.  

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)